Monday, April 07, 2025

January 4, 2011

కాలం కదిలిపోయింది


Tuesday, January 04, 2011 |

కాలం కదిలిపోయింది 
కాస్తంత తీపిని, చెడును వాకిట వదిలేసి !!

క్యాలెండర్ మారిపోయింది
శీలాక్షరాలని, చెదిరిన కలల్ని తరీఖులుగా గుర్తిన్చేసి
యేటి' కి  ఎదురీదిన జీవన చిత్రం 
డైరీలో ఒదిగింది
ఒకింత నిట్టూర్పుతో రవ్వంత హుషారుతో !!
కాలచక్రం 2011 లోకి అడుగిడింది
కొత్త ఆశలతో, కొంగొత్త  బాసలతో !!
అలసిన జీవితం స్వప్నిస్తోంది
మరో సమారంభాన్ని.. ఇంకో నవోన్మేషాన్ని

విశ్వ మానవాలి ఆఘ్రా నిస్తోంది
నవ వసంతపు పరిమళాల్ని
కొత్త యేటి  గుబాళింపుల్ని

అందుకే బిగ్గరగా చెప్పేద్దాం

       హ్యాపీ న్యూ ఇయర్


You Might Also Like :

Related Posts



0 comments:

Post a Comment